Jun 23,2023 01:41
కౌలు రైతు కార్డు అందిస్తున్న ఏవో సునీత

ప్రజాశక్తి-వేమూరు: ప్రతి రైతు కౌలు కార్డు తీసుకుని దానివల్ల కలిగే ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలని వేమూరు మండల వ్యవసాయ అధికారి సునీత రైతులకు సూచించారు. గురువారం వేమూరు మండలం చదలవాడ కుంచెల్లపాడు గ్రామాల రైతులకు కౌలు కార్డు ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పంట నమోదు (ఈ క్రాఫ్ట్‌ బుకింగ్‌), ప్రకృతి వైపరీత్యాలకు పంటలకు నష్టం వాటిల్లితే నష్టపరిహారం పొందేందుకు ఈ కార్డులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పంట కొనుగోలు, ఇన్సూరెన్సు, ఈ సాగు ధ్రువీకరణ అదేవిధంగా పరీక్షలకు కౌలు కార్డుల ప్రయోజనం ఉంటుందన్నారు. రైతులు మట్టి నమూనాలను మీ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రంలో విఏఏల ద్వారా భూసార పరీక్ష కార్డు ద్వారా మీ పంటకు కావాల్సిన ఎరువులు వినియోగించి భూసారాన్ని కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో చదలవాడ సర్పంచ్‌ డి రమేష్‌బాబు, ఎంపీటీసీ, కుంచెల్లపాడు సర్పంచ్‌ వెంకట సుబ్బయ్య, వెళ్లాబడు సర్పంచ్‌ ఎల్లభటి బుల్లయ్య, వీఆర్వోలు, విఎఎలు, రైతులు పాల్గొన్నారు.