Oct 05,2023 22:03

మాట్లాడుతున్న జి.వి. రాఘవరెడ్డి

 కడప ప్రతి పిటిషన్‌ పై రూ.20 లు స్టాంపు అతికించాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధతం చేస్తామని కడప బార్‌ అసోసియేషన్‌ (న్యాయవాదుల సంఘం) అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి హెచ్చరించారు. ప్రతి పిటిషన్‌ పై రూ. 20 లు వెల్ఫేర్‌ స్టాంపు అతికించాలని నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు గురువారం నుంచి ఈనెల 16 వరకు విధులు బహిష్కరించాలని తీర్మానం చేశారు. ఇందులో భాగంగా గురువారం విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కడప బార్‌ అసోసియేషన్‌ హాలులో సమావేశం నిర్వహించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. బార్‌ కౌన్సిల్‌ వారు ఇప్ప టికైనా దీనిపై స్పందించి ప్రతి పిటిషన్‌ పై రూ. 20 లు స్టాంపు అతికించాలని నిర్ణయాన్ని వెంటనే సస్పెండ్‌ చేసి చర్చలకు పిలవాలన్నారు. సమావేశంలో కడప బార్‌ అసోసి యేషన్‌ ఉపాధ్యక్షులు పి.ఎస్‌. బాలసుబ్రమణ్యం, సభ్యులు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.