ప్రతి పేదవానికి సంక్షేమ పతకాలు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యం : వైసీపీ
ప్రజాశక్తి -ప్యాపిలి
ప్రతి పేదవాని ఇంటికి సంక్షేమ పథకాలు అందివ్వడమే ప్రభుత్వ మొక్క ముఖ్య ఉద్దేశమని డోన్ నియోజకవర్గ పరిశీలకులు కోన మురళీధర్ రెడ్డి, జడ్పిటిసి శ్రీరామ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బోరెడ్డి పుల్లారెడ్డి మండల సచివాలయ కన్వీనర్ బోరా మల్లికార్జునరెడ్డి అన్నారు. జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం మెయిన్ రోడ్ లో నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఇంతకుముందు ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు.ప్రజలే ప్రభుత్వంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నడుపుతున్నదని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు ఎంత మెరుగు ప్రజలకు అందుతున్నాయి ఎవరికైనా పెన్షన్లు వంటి ఆగితే వాటి కారణాలు అన్వేషించి తక్షణం వారికి ఆ సహాయం ఇచ్చే దిశలో చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామన్నారు. 7 లక్షల మంది జగనన్న సైన్యం జనం మధ్యకు ధైర్యంగా వెళుతున్నామని మనం చేసిన అభివృద్ధి పనులు ఆత్మఫలంతో నమ్మకంతో చెబుతున్నామన్నారు. ఇది జగనన్న ప్రభుత్వం అన్న చేశాడు ఇంకా చేస్తాడు అని తెలుపుతున్నామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సామాజిక హోదాతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఇంటిని పలకరించడమే ఈ మెగా సర్వే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంగం చంద్రయ్య, బోరెడ్డి ప్రభాకర్ రెడ్డి,పర్వతం శీను, మధు, రంగనాయకులు, బషీర్, సోమశేఖర్, జింకల అంజి రామకృష్ణ, జాకీర్ పాల్గొన్నారు.










