ప్రతి పేద కుటుంబానికీ లబ్ధి
- ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ
రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేద కుటుంబానికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధి చేకూరుస్తున్నారని డిప్యూటీ సిఎం, జిల్లా ఇన్చార్జి మంత్రి అంజాద్ భాషా పేర్కొన్నారు. మంగళవారం ఆళ్లగడ్డలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో హౌసింగ్, మనబడి నాడు- నేడు, వ్యవసాయం, రీ సర్వే, వైద్య ఆరోగ్యం, ఇరిగేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో అభివృద్ధి చెందాలనే ప్రధాన ఆశయంతో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నారాన్నరు. పేదవారికి ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంటే అది కేవలం విద్య మాత్రమే అని ఎప్పుడు అంటుంటారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరులశాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ గౌసియా బేగం, జలవనరుల శాఖ చైర్మన్ గిరిజ హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస రావు, డిఆర్‌ఓ పుల్లయ్య, కమిషనర్ రమేష్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామలింగారెడ్డి, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, మండలాధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీడీవోలు, తహశీల్దారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, ఆళ్ళగడ్డ నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు.










