Oct 11,2023 22:54

ప్రజాశక్తి-అమలాపురం
ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి 2026-27 ఏడాది నాటికి ఒక మెడికల్‌ కాలేజీ అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు బుధవారం అల్లవరంలో సుమారు రూ.మూడు కోట్ల 90 లక్షలతో కార్పొరేటర్‌ దీటుగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి విశ్వరూప్‌, ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం మూలంగా తీర ప్రాంత గ్రామ ప్రజలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బెండమూర్లంకలో ఆర్‌బికె ప్రారంభం
అల్లవరం మండల పరిధిలోని బెండమూర్లంక గ్రామంలో సుమారు రూ.24 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి పినిపే విశ్వరూప్‌, శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్‌, ఎఎంసి చైర్‌ పర్సన్‌ డోలామణి రుద్ర, కె.బాపూజీ, ఎంపిపి యిళ్ళ శేషారా వు, జెడ్‌పిటిపి సభ్యురాలు కె.గౌతమి తదితరులు పాల్గొన్నారు.