Sep 27,2023 23:49

ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ రహిత గూడూరుకు సహకరించాలి..


ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ రహిత గూడూరుకు సహకరించాలి..
ప్రజాశక్తి - గూడూరు టౌన్‌ :పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్లాస్టిక్‌ రహిత గూడూరుకు అందరూ సహకరించాలని స్వచ్ఛ ఆంధ్ర సంస్ద చైర్‌ పర్సన్‌ పొనకా దేవసేనమ్మ పిలుపు నిచ్చారు. స్వచ్ఛత హి సేవా వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణం లోని డీ.ఆర్‌.డబ్ల్యూ కళాశాల ఆవరణలో అవగాహన నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. గూడూరు పట్టణంలోని డీ.ఆర్‌.డబ్ల్యూ కళాశాలలో పురపాలక సంఘం కమిషనర్‌ వెంకటేశ్వర్లు అద్వర్యంలో స్వచ్చత హి సేవా వారోత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన స్వచ్చ ఆంధ్ర సంస్ద చైర్‌ పర్సన్‌ పొనకా దేవసేనమ్మ స్వచ్చ భారత్‌ లో భాగంగా చీపురు పట్టారు. విద్యార్థులచే స్వచ్చ భారత్‌ పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పురపాలక సిబ్బం ది, విద్యార్థులకు అవగాహనతోపాటు పలు సూచన లిచ్చారు.కళాశాల ప్రతినిధు లు దేవసేనమ్మను ఘనంగా సత్కరిం చారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా స్వచ్చ ఆంధ్ర సంస్థ చైర్‌ పర్సన్‌ పొణకా దేవసేనమ్మ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌ లో యువత భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. స్వచ్ఛ గూడూరుకు తొమ్మిదేళ్ళుగా కషి చేస్తున్నానని, ఇప్పటికి 50శాతం వరకు మార్పు తీసుకురాగలిగానని తెలిపారు.ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి గుడ్డ సంచులు వాడాలని సూచించారు. ప్లాస్టిక్‌ రహిత గూడూరుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె వివరించారు.ఇంకా కమిషనర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు కోదండరామయ్య, గోపాల్‌ యాదవ్‌, చిన్న, సాయి, ముని,ఇమ్రాన్‌ పాల్గొన్నారు.