May 31,2023 23:28

పెదకాకాని: ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ మ్యాజిక్‌ నేర్చుకోవచ్చని రిటైర్డ్‌ ఎంపి డిఒ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు ఆదినారాయణ అన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాలలో భాగంగా స్థానిక గ్రంథాలయంలో బుధవారం నిర్వ హించిన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. శిబిరానికి 49 మంది విద్యా ర్థులు హాజరయ్యారు. విద్యార్థులతో కథలు చదివించడం, కథలు చెప్పించడం, లూడో, చెస్‌, బిజినెస్‌, వైకుంఠపాళి మొదలైన గేమ్స్‌ ఆడించారు. 'చదవడం మాకిష్టం' అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణ మ్యాజిక్‌, అంకెలతో వింతలు, వింత ఫజిల్స్‌, కథలు, ఆటలతో పిల్లలను అలరించారు. మ్యాజిక్‌లో భాగంగా అర చేతిలో కర్పూరం వెలిగించడం, వైట్‌ పేపర్‌తో రూ.2,000 తయారు చేయడం మొదలైనవి చేసి చూపించడమే కాకుండా విద్యార్థులతో కూడా చేయించారు. వీటి వెనుక ఎటు వంటి మాయలు, మం త్రాలూ లేవని ఉన్న దంతా సైన్స్‌ అని వారికి వివరించారు. చిన్నచిన్న ట్రిక్కులను వారి చేత చేయించారు. విద్యార్థుల ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్‌ క్యాంపును సద్వి నియో గం చేసుకొని విజ్ఞానం పెంపొందించు కోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థీ గ్రంథా లయం లో సభ్యత్వం తీసు కోవా ల్సిందిగా కోరారు. గ్రంథా లయాల్లో సభ్య త్వం తీసు కోవడం వలన కలిగే ప్రయో జనాలను విద్యార్థులకు వివ రించారు. ఈ కార్యక్రమంలో గ్రంథా లయా ధికారి వి. విజరుకుమార్‌, రిసోర్స్‌ పర్సన్స్‌ జి. వెన్నెల, ఎల్‌.జెస్సి, ఎల్‌. బ్లేస్సి పాల్గొన్నారు.