
మొక్క నాటి నీరు పోస్తున్న కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి
జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి
ప్రజాశక్తి అచ్యుతాపురం
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి అన్నారు. అచ్చుతాపురం ఎస్‌ఇజెడ్ పరిధిలో ఏటీజీ టైర్ల పరిశ్రమ ఆవరణలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్క నాటి నీళ్ళు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణం కాలుష్యం కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందన్నారు. వాతావరణం కాలుష్యం చెందకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని పరిశ్రమ యాజమాన్యాలకు ఆయన సూచించారు. పర్యావరణాన్ని కాపాడలని, పర్యావరణానికి సంబంధించి పలు ప్లకార్డులు ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల ప్రతినిధులు, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.