Oct 19,2023 21:50

కుండల్లోకి మట్టని పోస్తున్న అతిథులు

          ప్రజాశక్తి-అనంతపురం   దేశసేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. 'మేరీ మట్టి.. మేరా దేశ్‌'లో భాగంగా నెహ్రూ యువ కేంద్రం జాతీయ సేవా పథకం, సెంట్రల్‌ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అమృత్‌ కలష్‌ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ వాసంతిసాహిత్య, సెంట్రల్‌ యూనివర్సిటీ డీన్‌ డి.రామిరెడ్డి, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత బిసాటి భరత్‌ మాట్లాడుతూ యువత దేశంపై బాధ్యత కలిగి ఉండాలన్నారు. జాతీయ భావాలు కలిగి ఉండి దేశసేవకు ముందుకు రావాలన్నారు. అనంతపురం నెహ్రూ యువ కేంద్రం, రైపర్‌ ఫార్మసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైపర్‌ ఫార్మసీ కళాశాలలో మేరీ మట్టి మేరా దేశ్‌ కార్యక్రమంలో భాగంగా అమృత్‌కలశ్‌ యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ ఓ.ప్రణతి, డాక్టర్‌ జి.బాలాజీ, ఎం.విష్ణుప్రియ, ప్రగతిపథం యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.జయమారుతి, కార్యదర్శి వై.పవన్‌, సభ్యులు శీను, తుకారాం, సాయికిరణ్‌, శేషాద్రి, సంతోష్‌నాయక్‌, భరత్‌సాయి, అజరు, గణేష్‌, తేజస్విని, సంధ్య, స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.