Oct 07,2023 20:38

డెంకాడ: ఆరోగ్య కిట్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు

ప్రజాశక్తి- డెంకాడ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని చింతలవలస సచివాలయం-1లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కుటుంబం పెద్దగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బాధ్యతను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు, ఎంపిడిఒ డిడి స్వరూపరాణి, మోపాడ, డెంకాడ పిహెచ్‌సి వైద్యాధికారులు, సచివాలయ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వేపాడ: మండలంలోని బల్లంకి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య సేవలు విజయవంతంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 352 మంది వైద్య సేవలు పొందారు. ఈ శిబిరాన్ని ఎంపిపి దొగ్గ సత్యవంతుడు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు కె.రాజు, ఏ.ధరణి, ఎంఎల్‌టిలు, ఇద్దరు సూపర్‌వైజర్లు, సిహెచ్‌ఒలు, ఆశా వర్కర్లు జెడ్‌పిటిసి అప్పలనాయుడు, సర్పంచ్‌ బలంక లక్ష్మి, వార్డు మెంబర్‌ బొడ్డు శ్రీను, నూకురెడ్డి తాతారావు, బల్లంకి కనకరావు, తహశీల్దార్‌ కె.ప్రసన్న కుమార్‌, ఎంపిడిఒ బిఎస్‌కెఎన్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
తెర్లాం: మండలంలో పనుకువలసలో శనివారం తహశీల్దార్‌ బి. రతన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న పణుకువలస, సోమిదవలస, గోపాలవలస, జగన్నాథవలస గ్రామాలకు చెందిన 300 మందికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్‌వైజర్‌ ఉషారాణి, వైద్యాధికారులు డాక్టర్‌ మాధవి, డాక్టర్‌ వెంకటేష్‌, డాక్టర్‌ బి దివ్యభారతి, డాక్టర్‌ స్వరాబ్‌ పాటేల్‌, డాక్టర్‌ ప్రభావతి, డాక్టర్‌ కిరణ్‌, సర్పంచులు చందక సత్యనారాయణ, జి వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శులు జి నాగభూషణరావు, మోహన్‌, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు, పాల్గొన్నారు.
నెల్లిమర్ల: బొప్పడాంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే బడ్డు కొండ అప్పలనాయుడు పాల్గొని ప్రజల ఆరోగ్య పరిస్థితిలు, చేస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములు నాయుడు, వైసిపి మండల అధ్యక్షులు చనమల్లు వెంకట రమణ, వైస్‌ ఎంపిపిలు సారికి వైకుంఠం నాయుడు, పతివాడ సత్యంనారాయణ, రాష్ట్ర టూరిజం డైరెక్టర్‌ రేగాన శ్రీనివాసరావు, ఎంపిడిఒడి గిడుతూరి రామారావు, తహశీల్దార్‌ ధర్మ రాజు, స్థానిక సర్పంచ్‌, ఎంపిటిసి, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: మండలంలోని ఆలుగుబిల్లి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని కలిసి అక్కడ జరుగుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలుగుబిల్లి కాశీ విశ్వనాధన్‌, బీలా వెంకటరావు, చామలపల్లి సర్పంచ్‌ జుత్తాడ సూర్యారావు, ఎ.ఎన్‌.శర్మ, ఎస్‌.కోట వార్డు సభ్యుడు మజ్జి శేఖర్‌, సోషల్‌ మీడియా కో కన్వీనర్‌ మామిడి బుజ్జి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంధి తదితరులు పాల్గొన్నారు.
మెరకముడిదాం: గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతి పేదవాని ఇంటికి వెళ్లి వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని ధీర ఫౌండేషన్‌ అధినేత బొత్స సందీప్‌ తెలిపారు. శనివారం ఆయన మండలంలోని ఇప్పలవలస గ్రామ పంచాయతీలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, మాజీ డిసిఎంఎస్‌ చైర్మన్‌ ఎస్‌వి రమణరాజు, వైసిపి మండల అధ్యక్షులు కోట్ల విశ్వేశ్వరరావు, ఇప్పలవలస గ్రామ సర్పంచ్‌ బెహరా రమేష్‌, ఎంపిటిసి కెంగువ సాంబ మూర్తి, బిళ్ళల వలస సర్పంచ్‌ వర్మ రాజు, మెరక ముడిదాం వైసిపి నాయకులు కెఎస్‌ ఆర్కే ప్రసాద్‌, ఎంపిడిఒ ఎం. రత్నం, తహశీల్దార్‌ విజయ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.