Sep 30,2023 20:11

మాట్లాడుతున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

మాట్లాడుతున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
ప్రజాశక్తి-సీతారామపురం: జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని శనివారం మండలంలోని సంగారెడ్డిపల్లి సచివాలయంలో ఉదయగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆరోగ్య పరీక్షలులు చేయించుకుని ప్రభుత్వం అందిస్తున్న మందులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బసిరెడ్డి కష్ణారెడ్డి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు పానేం రమణయ్య, జేసీఎస్‌ మండల కన్వీనర్‌ బాలినేని మాబయ్య, ఎంపీటీసీ చప్పిడి వెంకటమ్మ, సర్పంచ్‌లు దుర్గం సంపూర్ణ, అయ్యవారిపల్లి సర్పంచ్‌ దుర్గా ప్రసాద్‌, ఎంపీడీఓ రంగ సుబ్బరాయుడు, తహశీల్దార్‌ ఎం.వి. సుధాకర్‌ రావు, వైద్యాధికారిని ఏ.స్వప్న, తదితరులు పాల్గొన్నారు.