Jun 28,2023 20:38

ప్రజలకు లబ్ధిపత్రాన్ని అందజేస్తున్న మంత్రి గుమ్మనూరు జయరామ్‌

ప్రజాశక్తి - ఆస్పరి
ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తెలిపారు. బుధవారం మండలంలోని జోహరపురం గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' సర్పంచి నెల్లూరప్ప అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా స్థానిక వైసిపి నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ కేంద్రాన్ని, రూ.23 లక్షలతో నిర్మించిన తాగునీటి సంపును మంత్రి చేతులమీదుగా ప్రారంభించారు. సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధికి సంబంధించి పత్రాలు అందజేశారు. అలాగే వారి కుటుంబంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.10 లక్షలు, బీసీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.10 లక్షలు మంజూరు చేశారు. వైసిపి నాయకులు గుమ్మనూరు నారాయణస్వామి, ఎంపిటిసి శ్రీరాములు, మండల కన్వీనర్‌ పెద్దయ్య, సింగిల్‌ విండో ఛైర్మన్‌ గోవర్ధన్‌, జిల్లా కెడిసిసి డైరెక్టర్‌ రాఘవేంద్ర, జడ్‌పిటిసి దొరబాబు, మాజీ కన్వీనర్‌ రామాంజనేయులు, మండల సచివాలయ కన్వీనర్‌ బసవరాజు, సిఇఒ అశోక్‌, శివకోటి, నాగన్న, తహశీల్దార్‌ కుమారస్వామి, ఎంపిడిఒ రాణెమ్మ పాల్గొన్నారు.