రాయచోటి : జిల్లాలోని ప్రతి ఒక్కరికీ గూడు కల్పించడమే తమ లక్ష్యమని గహ నిర్మాణ శాఖ పీడీ శివయ్య పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో లబ్ధిదారులు గృహనిర్మాణలు, బిల్లులు ఏ విధంగా ఇవ్వాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణ శాఖ ఇఇ, డిఇ, వర్క్ ఇన్‌స్పెక్టర్ల వివరాలు తెలియజేయండి?
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రాయచోటి, రాజంపేట, మదనపల్లె డివిజన్‌లలో ఇఇలున్నారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో డిఇలున్నారు. ప్రతి మండలానికి ఒకరు చొప్పున 30 మండలాల్లో 30 మంది ఎఇలున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 మంది వర్కింగ్ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో ఎన్ని లే అవుట్లున్నాయి? ఎన్ని గృహాలు మంజూరయ్యాయి?
జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గిరీషా సహకారంతో గహాలు పూర్తి కావడంలో రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నాం. 492 లేఔట్ కాలనీలు ఉన్నాయి. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి 73,756 గృహాలను మంజూరు చేయించాం. రూ. 13.24 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటివరకు 22,347 గృహాలు పూర్తయ్యాయి. ఇంకా ుదలు పెట్టని గృహాలు ఉన్నాయి. ఇందులో బిలో బేస్మెంట్ లెవెల్ 19,306 , పునాదులు 2 ,376 , గోడలు 7057, స్లాబులు 3367 పూర్తయిన గృహాలు 22,347 ఉన్నాయి.
ఒక్కో గృహానికి ప్రభుత్వం ఎంత మొత్తం మంజూరు చేస్తుంది?
గ్రామీణ, అర్బన్ ప్రాంతాలలో ఒక గహానికి రూ.1. 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మరో రూ. 35 వేలు పావలా వడ్డీకి రుణం మంజూరు చేస్తుంది. దీని ప్రకారం అయితే రూ. 2.15 లక్షలు అవుతుంది. లబ్ధిదారులకు కావాల్సిన మౌలిక వసతులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తోంది.
గృహ నిర్మాణాలు ఎప్పటికీ అవుతాయి?
జిల్లాలో 73,756 గృహాలు మంజూరైనాయి. డిసెంబర్ 2023 సంవత్సరం నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.పేదవాడి సొంతింటి కల నెరవేర్చేలా పనిచేస్తున్నాం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలలో భాగంగా అందరికీ గహాలు కట్టించాలిని లక్ష్యంతో పనిచేస్తుంది. త్వరగా గహాలు పూర్తిచేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడమే తమ లక్ష్యం .










