Jul 25,2023 20:34

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి శ్రీదేవి రవికుమార్‌

కలకడ : ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టు కుందని ఎంపిపి శ్రీదేవి రవికుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కలకడ మండల పరిషత్‌ కార్యాలయంలో మండ లంలోని స్వయం సహాయక సంఘ మహిళాసభ్యులకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాటా డుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మో హన్‌రెడ్డి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఉద్దేశంతో మహిళలు ఆర్థి కంగా ఎదగాలన్న ఆశయంతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి పురోబి óవద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా మరింత బలో పేతం కావాలని, మహిళలందరూ పారిశ్రా మికవేత్తలుగా ఎదగాల న్నారు. మహిళా సంఘాల పట్టిష్టత, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలు, బ్యాంకుకు తిరిగి చెల్లింపులు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎటిఎం రమేష్‌, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు పాల్గొన్నారు.