Sep 12,2023 23:49

ప్రజాశక్తి- సంతమాగులూరు
సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా పరిపాలన చేస్తున్నారని శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ కన్వీనర్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. మండలంలోని సజ్జాపురం గ్రామంలోని బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో ఆయన గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రజలను కలిసి సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పేద ప్రజలను సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం ప్రతిపక్ష పార్టీకి నచ్చడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. రాబోయే ఎన్నికలలో తిరిగి జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచి అనంతవరపు మార్తమ్మ, జడ్పిటిసి ఆడవి శ్రీనివాసరావు, వైసీపీ మండల కన్వీనర్ చింతా రామారావు, నాయకులు తేలప్రోలు వెంకటరావు, స్వాములు పాల్గొన్నారు.