Oct 20,2023 00:15

మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు

ప్రజాశక్తి - చీడికాడ:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమం మండలంలోని జైతవరం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రి ముత్యాలనాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నాయకులు ప్రజలను నిలువునా దోచేశారని, పింఛన్లు మొదలు ఏది కావాలన్నా లంచాలు తినిపించి చేయించుకునే పరిస్థితి ఉండేదని తెలిపారు. జగన్‌ సిఎం అయ్యాక అలాంటి రోజులకు కాలం చెళ్లి తెల్లవారు జామునే పోటా పోటీగా వాలంటీర్లు గ్రామ స్థాయి నుండి పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. ఏ అవసరం వచ్చినా గ్రామాల్లో ప్రజలకు వాలంటీర్‌ సేవలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. మాడుగులపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి ఉందనిజిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అనురాధ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు యర్రా అప్పారావు, మాడుగుల నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకులు ఉరుకూటి అప్పారావు, మండల పరిషత్‌ అధ్యక్షురాలు కురచా జయమ్మ నారాయణమూర్తి, మండల జెడ్పీటీసీ లాలం శారద జానకీ రామ్‌, చీడికాడ మండల పార్టీ అధ్యక్షులు గొల్లవిల్లి రాజబాబు, యువజన విభాగం అధ్యక్షులు గోల్లవిల్లి స్వామినాయుడు, మండల సచివాలయాల కన్వీనర్‌ ఈర్లే చైతన్య, మండల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కురచా కుమారి, చీడికాడ మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు, ధర్మిసెట్టి స్వాతి కొండబాబు, కిముడు చిన్నమ్మలు పాల్గొన్నారు.
మాడుగుల: మాడుగుల కేంద్రలో ''జగనే ఎందుకు కావాలంటేపై సమీక్ష సమావేశం జరిగింది. గురువారం సాయంత్రం పరమేష్‌ గోడౌన్లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పాల్గొని ప్రసంగించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు నేరుగా ప్రభుత్వం అందిస్తుందన్నారు.వార్డు స్థాయి నుండి వచ్చిన తనను మంత్రి స్థాయిలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్‌ రెడ్డిదే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వైఎస్‌ఆర్‌ పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఈర్లే అనురాధ, నియోజకవర్గం ఇంచార్జ్‌ పరిశీలకులు ఊరుకోటి అప్పారావు, ఎం పీపీ రామధర్మజ, వైస్‌ ఎంపీపీ రాజారామ్‌, సర్పంచ్‌ కళావతి పాల్గొన్నారు.