ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్ష
ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్ష
ప్రజాశక్తి కార్వేటినగరం: రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేస్ తీర్చిదిద్దడానికి, ఆదర్శంగా ఉంచాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని ఎంపీపీ లతబాలాజీ అన్నారు. బుధవారం మండల పరిధిలోని అమ్మపల్లి సచివాలయం ఆవరణంలో సర్పంచ్ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వైద్య సేవలు అందిస్తున్న జగనన్నకు ప్రజలు రుణపడి ఉండాలని పేర్కొన్నారు. శిభిరంలో అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్స్ చూపరులను ఎంతో ఆకట్టుకుంది. కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్రెడ్డి, ధనశేఖరవర్మ, శేఖర్రెడ్డి, లోకనాధనాయుడు, ఎంపీడీవో గోపినాధ్. డాక్టర్ కతిభాగ్యం పలువురు పాల్గొన్నారు.










