Aug 25,2023 21:30

మహిళలతో మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు

'పుల్లంపేట : ప్రతి కుటుంబ సంక్షేమం ప్రభుత్వ బాధ్యతని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రైల్వేవకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపగడపకు తిరిగి ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల నుంచి వస్తున్న వినతులను సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యను వారి సమక్షంలోనే పరిష్కరించారు. గ్రామంలో నాడు నేడు పనులను పరిశీలించి ప్రభుత్వం ప్రవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులను కల్పిస్తుందని తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం అని ప్రజల వద్దకే పాలనని మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ, ఎమ్మెల్యే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యను పరిష్కరించాలని ప్రతి గడపకు తిరగాలని తెలియజేయడం వల్ల గ్రామాలలో కొన్ని వేళలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజలు, రోజు కూలీ పని చేసుకునేవారు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. మూడు సంవత్సరాల పాలన ముగిసిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఎమ్మెల్యే నుంచి వాలంటరీ వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేవిధంగా చర్యలు చేపట్టారని తెలియజేశారు. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకుండా ఉంటే వెంటనే తమ దష్టికి తీసుకురావాలని తెలపారు. మండల పరిధిలోని దలవాయిపల్లి గ్రామ హరిజనవాడలో కోదండరామస్వామి దేవస్థాన నిర్మాణానికి రూ.50 వేలు, శ్రీరాములపేటలో నరసింహ స్వామి దేవస్థానానికి రూ.50 వేలు, దలవాయిపల్లి గ్రామానికి చెందిన పెద్ద మస్తాన్‌ అనే వైసిపి కార్యకర్త ఆర్థిక భారంతో సతమవుతమవుతున్న కారణంగా రూ.90 వేలు అందజేశారు. కార్యక్రమంలో రైల్వేకోడూర్‌ నియోజకవర్గ సీనియర్‌ నాయకులు కొల్లం గంగిరెడ్డి, ఎంపిపి ముద్ద బాబుల్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి, తహశీల్దార్‌ నరసింహా కుమార్‌, ఎంపిడిఒ రఘురాం, ఎస్‌ఐ రఘురాం, హేమన వర్మ, గ్రామ సచివాలయాల కన్వీనర్‌ నాగిరెడ్డి హరినాథరెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ ముస్తాక్‌, రామనాథం, మల్లికార్జునరెడ్డి, మూగ వెంకట్‌రెడ్డి, రొంపిచర్ల లక్ష్మీనారాయణ, బోధనపు సిద్దు, విజరు కుమార్‌రెడ్డి, రమణారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సచివాలయ అధికారులు, వాలంటీర్లు, గహసారథులు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.