ప్రజాశక్తి - కశింకోట
గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. కశింకోట నారాయణ మూర్తి కళ్యాణ మండపంలోనూ, బయ్యవరం ఎస్‌ఆర్ గార్డెన్‌లోనూ శుక్రవారం 'మా నమ్మకం నువ్వే జగనన్న' కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడలేక టిడిపి బురదజల్లే కార్యక్రమం చేపడుతుందని ఆరోపించారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంటికీ వెళ్లి వారి అనుమతితో వారి ఇంటి డోర్‌పై స్టిక్కర్ అంటించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదున్నర లక్షల మంది రథసారథులు ఉన్నారని తెలిపారు. మార్చి నెల పెన్షన్లకు వాలంటీర్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కలగా లక్ష్మి, జడ్పిటిసి దంతలూరి దంతులూరి శ్రీధర్‌రాజు, సర్పంచ్‌లు కలగా గున్నయ్య నాయుడు, మంత్రి జయ రజిని, వైపిపి నాయకులు మల్ల బుల్లి బాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, మలసాల కిషోర్, పలకా రవి, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కరకా సోమనాయుడు, వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి నమ్మి మీనా, నీటిపల్లి లక్ష్మి, పెంటకోట శ్రీనివాసరావు, నమ్మి గణేష్ పాల్గొన్నారు.










