ఎంపిపి కారం లక్ష్మి
ప్రజాశక్తి-విఆర్.పురం
రేఖపల్లి గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు పైపులైన్లు వేస్తున్నట్లు ఎంపీపీ కారం లక్ష్మి, స్థానిక సర్పంచ్ పూనెం సరోజిని, ఎంపీటీసీ బంధం విజయలక్ష్మి తెలిపారు. రేఖపల్లి పంచాయతీ పరిధి ఎంపిడిఓ ఆఫీసు వద్ద సుమారు 700 మీరటర్ల తాగునీటి పైపు లైన్ ఏర్పాటుకు వారు శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, నాయకులు పంకు సత్తిబాబు నల్లారపు ప్రకాష్ రావు, సిరపు తాతబాబు, రెడ్డి హజరత్, ఆర్‌డబ్ల్యుఎస్ జెఈ సాయిరాం ప్రసాద్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తరుణ్, సచివాలయం సెక్రటరీ శివప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.










