ప్రొద్దుటూరు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలంటే అపారగౌరవ భావం ఉందని దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా తన పాలనలో ఇరువురు మహిళలను రాష్ట్ర హోమ్ మంత్రులుగా నియ మిం చారని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభో త్సవాలు, సేవ, భూమిపూజ కార్యక్రమాలను రాష్ట్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి నిర్వహించారు. అమృత్ మంచినీటి పథకం, మున్సిపల్ గాంధీ పార్కు, అర్బన్‌హెల్త్ సెంటర్, రాచమల్లువారి రాజన్నభోజనం కార్యక్రమాలను ప్రారంభించి మైదుకూరు రోడ్డు స్మార్ట్‌స్ట్రీట్‌కు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా రాజన్నభోజనం ప్రారగ ణంలో ఏర్పాటు చేసిన బహి రంగ సభలో హోం మంత్రి మాట్లాడుతూ కడప అంటే తనకు వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుకొ స్తారని చెప్పారు. అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మన వడిగా జగన్ అందరి అవసరాలు తీరు స్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పాలనలో ప్రతి ఇం టికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. పేదలకు ఒకపూట కడుపునిండా అన్నంపెట్టేందుకు ఎమ్మెల్యే రాచమల్లు ఉచిత భోజన కారక్రమాన్ని సొంత నిధులతో ప్రారంభించి 11 సంవత్సరాలపాటు శక్తి ఉంటే అనంతరం కూడ కొనసాగిస్తామని చెప్పడం గొప్పవిషయం అని చెప్పారు. మానవతా విలువలు కలిగిన రాచమల్లును వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు పట్ట ణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లా డుతూ ముఖ్యమంత్రి జగన్ పాలన జనరంజకంగా, పారదర్శకంగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృధ్ది జోడుగుర్రాలుగా పరుగులు పెడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసా దరెడ్డి మాట్లాడుతూ 2014-19 బాబు పాలనను, 2019-24 జగన్ పాలనను గమనించాలని, రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రయోజనాలకు పాటుపడిన పార్టీకి మద్దతివ్వాలని కోరారు. 2019 నుంచి వైసిపి జెండా మేలు చేసిఉంటే మానవత్వంతో మద్దతివ్వాలని లేకుంటే తిరస్కరించాలని కోరారు. నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి అబివృద్దికి నోచుకోని ప్రొద్దుటూరును ఈ నాలుగు సంవత్సరాలలో అభివృద్ది, సంక్షేమంలో పరుగులు పెట్టించమన్నారు. వివక్షలేకుండా కేవలం పేదరికమే ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాలు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బి.లకిëదేవి, వైస్ చైర్మన్లు ఖాజీమొహిద్దీన్, బంగారెడ్డి, వైసిపికి చెందిన కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, సిబ్బంది, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.










