May 16,2023 00:04

పథకాలను వివరిస్తున్న ధర్మశ్రీ

ప్రజాశక్తి -రావికమతం:సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందించడమే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పని చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ అన్నారు. మండలంలో మరుపాక గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ధర్మ శ్రీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా అమలు కాని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నామన్నారు. ఎటువంటి అవినీతికి, లంచాలకు తావు లేకుండా పని చేయడం జరుగుతుందన్నారు. పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా రాష్ట్ర ప్రజలందరినీ సమాన దృష్టితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చూస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైలరాజు, మండల పార్టీ అధ్యక్షులు ముక్కామహాలక్ష్మి నాయుడు, మండల కన్వీనర్‌ జగన్నాధరావు, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ సత్యదేవ్‌, వైస్‌ ఎంపీపీ దంట్ల వెంకటరమణ, మరుపాక సర్పంచ్‌ పండూరు సత్తిబాబు, మాజీ సర్పంచ్‌ రావి గోవిందు పాల్గొన్నారు.