Jan 20,2023 23:46

మహిళతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాబూరావు

ప్రజాశక్తి పాయకరావుపేట:ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని పాయకరావుపేట శాసనసభ్యులు, ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ గొల్ల బాబురావు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెంకట నగరం పంచాయతీలో పర్యటించారు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుంటే గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార కార్పోరేషన్‌ డైరెక్టర్‌ చోడిపల్లి శ్రీనివాస్‌, జడ్పిటిసి లంక సూర్యనారాయణ, ఎంపీపీ పార్వతీ తాతారావు, మండల పార్టీ అధ్యక్షుడు దనిశెట్టి బాబురావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీనివాసరావు, కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వేమగిరి లక్ష్మణరావు, బీసీ నాయకులు కేసనకుర్తి సత్తిబాబు, తహసిల్దార్‌ కే.జయప్రకాష్‌, ఈవోపీఆర్డి సిహెచ్‌ చంద్రశేఖరరావు, కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం:
మండలంలోని చిప్పాడ, ఉద్దపాలెం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని యలమంచిలి ఎమ్మెల్యే యువి.రమణమూర్తిరాజు శుక్రవారం చేపట్టారు. ఆయనకు ఎంపీటీసీ సభ్యుడు రాజాన పైడి భాస్కరరావు బాషా పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రెడ్డి శ్రీనివాసరావు, సర్పంచ్‌ రాజాన నాయుడు బాబు, జడ్పిటిసి సభ్యులు లాలం రాంబాబు, వైసిపి మండల అధ్యక్షులు దేశం శెట్టి శంకర్రావు, పార్టీ సీనియర్‌ నాయకుడు కోన బుజ్జి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.