Oct 11,2023 21:00

బి.కోడూరు : వైద్యశిబిరంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, నాయకులు, వైద్యులు

బి.కోడూరు : ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీ వైద్యం వైద్య సేవలు అని ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి తెలిపారు. అయిత్రంపేట గ్రామ సచి వాలయంలో ఎంపిడిఒ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య శిబిరంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో చర్చించి, శిబిరానికి వారికి ఉచిత వైద్య పరీక్షలు చేయించి, మందులు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని ప్రతి ఒక్క కుటుంబం ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తెలి పారు. కార్యక్రమంలో డాక్టర్‌ వినీత్‌రాజు, డాక్టర్‌ ఉదరుకిరణ్‌, మండల వైసిపి కన్వీనర్‌ చౌదరి రామకృష్ణారెడ్డి, జడ్పిటిసి దావీదు, వైస్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌ రెడ్డి, నాయకులు అయితంపేట పిచ్చిరెడ్డి, లెక్కల పిచ్చిరెడ్డి, రెడ్డి వారిపల్లె రామలక్ష్మిరెడ్డి, పిహెచ్‌సి వైద్య సిబ్బంది, సచివాలయ ఆశ ఆరోగ్య మిత్ర ఓ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కడప అర్బన్‌ : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్నారని, పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి. అంజాద్‌బాషా పేర్కొన్నారు. బుధవారం అగాడి వీధి కట్టకింద దళితవాడ వద్ద ఉన్న అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, నగర పాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వ హించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు అప్జల్‌ఖాన్‌, కార్పొరేటర్లు కమాల్‌ బాషా, షేక్‌ మహమ్మద్‌ రఫీ, షేక్‌ మహమ్మద్‌ షఫీ, తహశీల్దార్‌ శివరామిరెడ్డి, నాయకులు పెద్దిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, వైద్యులు వైద్యాధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాపాడు : అల్లాడుపల్లె గ్రామంలో బుధ వారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎంపిపి టి.లక్ష్ముమయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై చర్యలు చేపట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్ర మంలో మండల ప్రత్యేక అధికారి సురేష్‌రెడ్డి, ఎంపిడిఓ శ్రీధర్‌ నాయుడు, తహశీల్దార్‌ యామిని, డాక్టర్‌ రాజేష్‌కుమార్‌, కావ్య మాధురి, గృహ సారధుల మండల కన్వీనర్‌ రామ్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ కిశోర్‌కుమార్‌రెడ్డి, వైద్య సిబ్బంది రాఘవయ్య, భాస్కర్‌, నారాయణరెడ్డి, రమేష్‌, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సింహాద్రిపురం : జగనన్న ఆరోగ్య సురక్షను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి నాగలింగాచార్యులు కోరారు. బుధవారం మండలంలోని పైడిపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్ర మంలో వైద్యులు సృజన, షేక్‌ ఖాజా మొహిద్దిన్‌, తహశీల్దార్‌ మహబూబ్‌ బాషా, ఎంపీడీవో కృష్ణమూర్తి, వైసిపి నాయకుడు శివారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఎర్రగుంట్ల : కలమల్ల-2 సచివాలయం పరిధిలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, డిఎంహెచ్‌ఒ నాగరాజు, జమ్మలమడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులు పాల్గొని ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ నాగేశ్వరరావు, ఎంపీడీవో రంతుల్లయ్య, జడ్పిటిసి బాలయ్య, మండల వైస్‌ ప్రెసిడెంట్‌ శీను, సున్నపురాళ్లపల్లి సర్పంచ్‌ వరలక్ష్మి, వైద్యులు సాయిచరిత, పద్మావతి, నాగార్జున, స్పెషలిస్ట్‌ డాక్టర్లు పవన్‌కుమార్‌, దీపక్‌, ఆరోగ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి జగనన్న సురక్షతో శ్రీకారం చుట్టారని తహశీల్దార్‌, ఎంపిడిఓ సి.గుర్రప్ప, చెన్న రాఘ వేంద్రనాథ్‌ తెలిపారు. పి.బొమ్మేపల్లెలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఆగ్రామ సర్పంచ్‌ జి.రామనాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయం సెక్రటరీ శివ మహేంద్రారెడ్డి, ఎపిఎం గురుకుమార్‌, అధికారులు, సచివాలయం, అంగన్‌వాడీ, ఆర్బికే, వైద్య, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గ్రామ వైసిపి నేత జి.ప్రతాప్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్స్‌, వలంటీర్లు పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : ఇంటి వద్దకే వైద్యం అందించాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఒ వెంకటేష్‌ అన్నారు. ఎర్రబల్లి గ్రామ సచివాలయం-2లో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతోపాటు వైద్యులు లిఖిత, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అట్లూరు : కొండూరు సచివాలయంలో బుధవారం జగనన్న సురక్ష ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా ప్రారంభించారు. కార్యక్రమానికి డాక్టర్‌ ఎస్‌ రవిబాబు, అడిషనల్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తహశీల్దార్‌ వెంకట రమణమ్మ, ఎంపీడీవో సుజాతమ్మ, వైసిపి జిల్లా సంయుక్త కార్యదర్శి అందూరి రామకృష్ణారెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ ప్రభాకర్‌రెడ్డి, అటవీశాఖ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, జిల్లా పశుగణాభివృద్ధి సంఘం చైర్మన్‌ మాధవరెడ్డి, సచివాలయ మండల కన్వీనర్‌ మల్లికార్జున్‌రెడ్డి, వైసిపి నాయకులు రెడ్డయ్య, రాజగోపాల్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ సుధా, ఎంపీటీసీ లక్ష్మీదేవి పాల్గొన్నారు.