చాపాడు : వైసిపి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పెద్దగురవలూరు సచివాలయ పరిధిలో గురువారం ఆయన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించేందుకు ప్రతి ఇంటికి వెళ్లి తెలుసుకుంటున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. పెద్ద గురువలూరుకు సంక్షేమం, అభివృద్ధి ద్వారా రూ.14.74 కోట్లు మంజూరైందన్నారు. శ్రీరాములపేట గ్రామంలో విద్యుత్ సమస్య ఉందని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వర్షం నీరు నిలుస్తోందని, డ్రయినేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. శ్రీరాములపేట ఎస్‌సి కాలనీలో లెవెన్ కెవి విద్యుత్ లైన్లు ఇళ్లపై వెళుతున్నాయని తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, ఎంపిపి లక్ష్ముమయ్య, తహశీల్దార్ సుభాని, ఈఓపీఆర్డీ రాధాకృష్ణవేణి, ఎఓ మ్యాగీ, అంగన్వాడీ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, ఎపిఎం వెంకటరమణ, మండల కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, గృహ సారథుల మండల కన్వీనర్ రామ్మోహన్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వేమారెడ్డి, సర్పంచ్ రాజేష్, నాయకులు ఓబుళరెడ్డి, జయసుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రమణయ్య, జయరామిరెడ్డి, సివి సుబ్బారెడ్డి, కిషోర్‌కుమార్‌రెడ్డి, బాల వేమారెడ్డి, సత్య వేమారెడ్డి, నాగిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, సంజీవరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శ్రీనువాసులరెడ్డి, ధనేశ్వర్ బాబు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
నేడు ఓబురెడ్డిపేటలో 'గడపగడపకూ మన ప్రభుత్వం'
పెద్దగురువలూరు సచివాలయ పరిధిలోని ఓబుళరెడ్డి పేటలో శుక్రవారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపిపి టి.లక్షుమయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి పాల్గొంటారన్నారు. మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఎంపిపి ప్రజలను కోరారు. సచివాలయం సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వాలంటీర్లు అందుబాటులో ఉండాలని సూచించారు.










