
ప్రజాశక్తి - పంగులూరు
ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి ఇచ్చి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని జలజీవన మిషన్ సెంట్రల్ టీం సభ్యులు జగత్ జిత్ సింగ్ సోది, సిసిర్ బసేర్ కోరారు. మండలంలోని ఆరికట్లవారిపాలెం, బూదవాడ, కళ్ళంవారిపాలెం, కోటపాడు గ్రామాల్లో సెంట్రల్ టీం బుధవారం పర్యటించింది. గ్రామాల్లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఉండేటట్టుగా ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. సైడ్ కాలవల్లో మురుగునీరు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. వ్యాధులు రాకుండా ఉండేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఆయా గ్రామాల్లోని మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన 5 మాన్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. జల జీవన మిషన్ అకౌంట్లను, రికార్డులను ఎలా నిర్వహించాలనేది వివరించారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగర్, అద్దంకి డిఈ శ్రీనివాసులు, ఏఈ శివయ్య, జల జీవన మిషన్ ఒంగోలు ప్రాజెక్టు మేనేజర్ సుధీర్, గుంటూరు ప్రాజెక్టు మేనేజర్ కిరణ్ కుమార్, ఒంగోలు జిల్లా కోఆర్డినేటర్లు మోహనరావు, రవి, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ సంగీత, బాపట్ల జిల్లా జలజీవన మిషన్ కోఆర్డినేటర్ కృష్ణారావు, పంగులూరు ఎంపీడీఒ రామాంజనేయులు, పంచాయతీరాజ్ ఏఈ రాంకుమార్, ఈఓఆర్డి రాంబాబు పాల్గొన్నారు.