Feb 16,2023 23:03

ప్రజాశక్తి-కంచికచర్ల 

కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో గురువారం నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌ రావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి మోసం చేస్తే . ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని .. ఆ వివరాలతో ప్రజల ముందుకు సగర్వంగా వస్తున్నామన్నారు. గతంలో ఏ పాలకులు మీ కుటుంబానికి తాము చేసిన సాయం ఇది అని కరపత్రాలు ముద్రించి ఇచ్చిన దాఖలాలు లేవని -ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం మేము చేస్తున్న మంచిని -అందిస్తున్న పాలనను తెలిసేలా ప్రతి ఏటా కరపత్రాలు ముద్రించి మరీ ప్రజల ముందుకు పంపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ యద్దనపూడి జోష్ణ, జెడ్పిటిసి వేల్పుల ప్రశాంతి , మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ మార్త రజిని శ్రీనివాస్‌, నాయకులు చింతా రవీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.