Aug 31,2023 00:14

రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి- కొయ్యూరు
గిరిజన ప్రాంతంలో ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. కొయ్యూరు మండలం కంఠారం గ్రామపంచాయతీ పరిధిలో చోద్యం బ్రిడ్జి దగ్గర నుంచి కంఠారం పీహెచ్‌సీ వరకు 7.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్న విషయాన్ని స్థానిక సర్పంచ్‌, వైసిపి సీనియర్‌ నాయకులు గాడి సత్యనారాయణ ద్వారా గ్రామస్తులు తమకు తెలియజేసిన వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు చేసినట్లు చెప్పారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా నాబార్డ్‌ నిధులతో దీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి రోడ్డు నిర్మాణం పూర్తవుతుందన్నారు. గింజర్తిలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని, కొత్త చీడిపాలెంలో కొన్ని బ్రిడ్జిలు నిర్మించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్‌, జెడ్పిటిసి వారా నూకరాజు, వైస్‌ ఎంపీపీ ఎ.వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్‌ జె.రాజులమ్మ, ట్రైకార్‌ డైరెక్టర్‌ ఎస్‌.లోవరాజు, స్థానిక సర్పంచ్‌ కన్నయ్యమ్మ, రమణ, ఉప సర్పంచ్‌ వనుం బాబు, బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి నాగమణి, జి సత్తిబాబు, వైపిపి నాయకులు జె.బాబులు, సర్పంచ్‌లు ముసిలి నాయుడు, శ్రీను, రాజకుమారి, ఎంపీటీసీలు బి.అప్పారావు, మల్లేశ్వరి, ఏఎంసీ డైరెక్టర్‌ అచ్యుత్‌, జి.గోవింద్‌, ఆర్‌ గంగాధర్‌ , ఎన్‌ సూరిబాబు, బి.సుధాకర్‌, బి.శేఖర్‌, ధోని బాబ్జి, రమణబాబు పాల్గొన్నారు.