ప్రతి గడపకు సంక్షేమ పథకాలే లక్ష్యం : ఎంపిపి
ప్రజాశక్తి - బేతంచర్ల
సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వర్తింప చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, బాబుల్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఎంబాయి గ్రామంలో గ్రామ సర్పంచి యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నాగభూషణం రెడ్డి, సీనియర్ నాయకులు బాబు రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, తాగునీటి సమస్య వంటి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోరుమానుకొండ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, ముస్లిం మైనార్టీ జిల్లా నాయకులు మూర్తి జావలి, గూని నాగరాజు, కుంచే తిరుమలేశ్వర్ రెడ్డి, ప్లాట్ల దస్తగిరి, చంద్రశేఖర్ అయ్యా, కృష్ణుడు,రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ మురళి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
బుక్‌లెట్‌ను అందజేస్తున్న ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి










