Apr 17,2023 20:18

ఆత్మకూరులో మా నమ్మకం నువ్వే జగనన్న

ప్రతి గడపకు పథకాలు : వైసిపి
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

వైసిపి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. మండలంలోని అహోబిలం గ్రామంలో సోమవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో అహోబిలానికి రూ.5 కోట్లతో రోడ్లు నిర్మాణం పూర్తి చేశామని, మరో 3కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో గంగుల విజయ సింహా రెడ్డి , ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి, గంగుల రామిరెడ్డి, సర్పంచ్‌ నాసారి వీరమ్మ, కెడిసిసి బ్యాంక్‌ డైరెక్టర్‌ నాసారి వెంకటేశ్వర్లు(సీసా), వైస్‌ ఎంపీపీ నాసారి నరసింహ ప్రసాద్‌, వైస్‌ సర్పంచ్‌ సల్లా మధు యాదవ్‌ , వైసీపీ నాయకులు రామచంద్రుడు, నియోజకవర్గం సోషల్‌ మీడియా కో కన్వీనర్‌ దోరకొట్టల నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్‌: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో సోమవారం 18, 24 వార్డులు అర్బన్‌ కాలనీల్లో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ రాజగోపాల్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ఎంఏ రషీద్‌, కౌన్సిలర్లు యూనిస్‌, బోయ పార్వతి, తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి సంక్షేమ పథకాలు వివరించి, ప్రజల అనుమతితో వారి ఇంటికి స్టిక్కర్లు వేశారు. బేతంచర్ల:మండల పరిధిలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్‌ గుమ్మగాళ్ల రాజు, ఎంపీటీసీ నాగ శేషుల ఆధ్వర్యంలో మా నమ్మకం నీవే జగనన్న, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ గుమ్మగాళ్ల రాజు, ఎంపీటీసీ నాగ శేషు మాట్లాడుతూ ప్రభుత్వం రాజకీయ పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సత్యం రెడ్డి, గ్రామ కన్వీనర్‌ తిమోతి, ఎం శేఖర్‌ మధు తత్తలు పాల్గొన్నారు.