Nov 18,2023 22:13

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు

పాలకొండ: రైతుల దగ్గర ప్రతి గింజ కొనాల్సిందేనని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. శనివారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని సకాలంలో తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడే పరీక్షలు జరపాలని సూచించారు. మిల్లర్లు గ్యారంటీలు సమర్పించి ధాన్యం సేకరించాలన్నారు. రైతులకు ఇబ్బంది ఎదురైతే ఉపేక్షించేది లేదని అన్నారు. సమావేశంలో డిఎస్‌ఒ శివప్రసాద్‌, జిల్లా మేనేజర్‌ నాయక్‌, ఆర్‌డిఒ ఎం.లావణ్య తదితరులు పాల్గొన్నారు.