Mar 29,2023 01:26
మహిళలకు చెక్కులు పంపిణీ చేస్తున్న శాసనసభ్యులు కోన రఘుపతి

ప్రజాశక్తి-కర్లపాలెం: కర్లపాలెం మండలం వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కోన రఘుపతి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కర్లపాలెం మండలం మొత్తం మీద 1079 గ్రూపులు ఉండగా వైఎస్సార్‌ ఆసరా కింద 9 కోట్ల 82 లక్షల రూపాయలు మూడో విడతగా మంజూరు చేసినట్లు తెలిపారు. పుట్టిన బిడ్డ నుంచి ముసలివాళ్ల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి తగు పథకాలను అమలు చేయడంతో పాటు, మహిళాభివృద్ధి ద్వారానే కుటుంబాభివృద్ధి జరుగుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అని అన్నారు. తదనంతరం మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు జిల్లా డిపిఎం లక్ష్మాచారి, ఏపీఎం శ్రీనివాస్‌రెడ్డి, మండల సమైక్య అధ్యక్షురాలు సిహెచ్‌ నాగమల్లేశ్వరి, సెక్రటరీ ధనలక్ష్మి, సర్పంచ్‌ నక్క లలితకుమారి, మండల కన్వీనర్‌ సీతారామరెడ్డి, జెడ్పిటిసి వేణుగోపాల్‌ రెడ్డి, ఎంపీపీ యారం వనజ, ఉపాధ్యక్షులు పి సుబ్బారావు, ఎంపీటీసీలు తాండ్ర సాంబశివరావు, ఆసిఫ్‌ ఆలీ, సర్పంచులు నాని, శ్రీనివాసరెడ్డి, మల్లెల వెంకటేశ్వర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.