May 15,2023 01:38
మజ్జిగ అందజేస్తున్న హృదయ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు

ప్రజాశక్తి-వేటపాలెం: మజ్జిగ చలివేంద్రం హృదయ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు. వేసవిలో పాదచారుల, వాహనదారుల దాహార్తిని తీర్చడానికి హృదయ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో రామా నగర్‌లోని డాక్టర్‌ మధు క్లినిక్‌ ప్రాంగణంలో గత 15 రోజుల నుంచి చలివేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేసవి ఎండలు, వడగాలులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోగ్యకరమైన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషదాయమని వైస్‌ ప్రెసిడెంట్‌ బొడ్డు శివయ్య అన్నారు. హృదయ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారు ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలని అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరావు అన్నారు. పులిహార పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి మందారపు రమేష్‌, మాజేటి బాలాజీ, వూట్ల వెంకటేశ్వర్లు, వారి శ్రీనివాసరావు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరావు, ప్రెసిడెంట్‌ నన్నపనేని సునీల్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బొడ్డు శివయ్య, ఆర్గనైజర్‌ అండ్‌ ట్రెజరర్‌ పేరిసెట్ల బ్రహ్మయ్య, జనరల్‌ సెక్రెటరీ గుగ్గిలం శ్రీహరి, సభ్యులు డాక్టర్‌ మధు, వూట్ల వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మాజేటి బాలాజీ, బుద్ధి శ్రీనివాసరావు, మస్తాన్‌, సోమరాజు, బొడ్డు వెంకటేశ్వర్లు, గాత్రం బాలాజీ (ఫోటో స్టూడియో), మరియు ముఖ్యఅతిథిగా నాసిక వర శివాజీ హాజరయ్యారు.