తుళ్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సిపిఎం గుంటూరు జిల్లా కమిటీ అధ్వర్యంలో ఈ నెల 25న గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సభలో రాజధాని ప్రాంత ప్రజలు పెద్దయెత్తున పాల్గొనాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి పిలుపు నిచ్చారు. బుధవారం రాజధాని ప్రాంతం తుళ్లూరు లోని ప్రజాసంఘాల కార్యాలయంలో పేరం బాబూరావు అధ్యక్షతన సిపిఎం విస్తృత సమావేశంలో రవి మాట్లాడారు. 25న సాయంత్రం మూడు గంటలకు జరిగే సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు పాల్గొని ఉపన్యసిస్తారని చెప్పారు. రాష్ట్రానికి, అమరావతి రాజధానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని అన్నారు. రాజధాని అభివృద్ధికి ఎనిమిది బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా రాజధాని ప్రజలను కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాలను అమలు చేయకుండా తుంగలో తొక్కిందని అన్నారు. ప్రజలపై భారాల మీద భారాలు వేస్తూ మరో ప్రక్క కార్పోరేట్ శక్తులకు మాత్రం రాయితీలు కల్పిస్తూ, లాభాలను తెస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం వారికి కారు చౌకగా బిజెపి ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని కోరారు. సమావేశంలో సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం భాగ్యరాజు,పా బత్తుల వెంకటేశ్వరరావు, రాములు పాల్గొన్నారు.
దుగ్గిరాల: కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యజీవితాసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు తెలిపారు. బుధవారం దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో సిపిఎం నాయకులు మన్నవ నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పోరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. ఎల్‌ఐసి, జిఐసి, రైల్వేలు టెలికాం ఇతర ప్రకృతి వనరులను సైతం అంబాని ఆదానీలకు కట్టబెడుతున్నారన్నారు. మండల కార్యదర్శి జెట్టి బాలరాజు మాట్లడుతూ ఆగస్టు 25 న గుంటూరులో జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి ఎం నరసింహారావు, బి చిరంజీవి, ఎం ఇందిర, బి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. తెనాలి: కేంద్రంలోని బిజేపి సర్కార్ ప్రధాని మోది నేతృత్వంలో రాజ్యాంగ వ్వవస్థకు తూట్లు పొడుస్తోందని, దీనిని ప్రజలు తిప్పికొట్టాలని సిపిఎం సీనియర్ నాయకులు ములకా శివసాంబిరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై 25న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సభను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం కొల్లిపర మండలం అత్తలూరివారిపాలెం, వల్లభాపురంలో పర్యటించారు. ప్రభుత్వాలు ఆమలు చేస్తున్న రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలపై సభలో సీపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు జెవి రాఘవులు ప్రసంగిస్తారని, సభకు వివేషంగా తరలి రావాలన్నారు. కార్యక్రమంలో అత్తోట వీరయ్య, కొలకలూరి కృష్ణ, గొడవర్తి రామారావు, కనపాల రోశయ్య, షడ్రక్, వల్లభాపురం సుబ్బారావు పాల్గొన్నారు. పొన్నూరు రూరల్: 25వ తేదీ మధ్యాహ్నాం గుంటూరు వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో ప్రస్తుత రాజకీయ పరిణామలపై నిర్వహించే సభను జయప్రదం చేయాలని సిపిఎం పొన్నూరు మండల శాఖ సహాయక కార్యదర్శి నిమ్మకూరు రమేష్ బాబు పిలుపునిచ్చారు. పొన్నూరులో ప్రచారం నిర్వహించారు. తాడికొండ: దేశ ప్రజలను ముక్కలు చేసే బిజెపికి బుద్ధి చెప్పండని సిపిఎం గుంటూరు జ ఇల్లా కమిటీ సభ్యులు కంచుమాటి ఆజరుకుమార్ తెలిపారు. బుధవారం తాడికొండలో నాయకులు చింతల భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించిన సిపిఎం విస్తృత సమావేశంలో ఆయన ప్రసంగించారు. 25న గుంటూరులో ప్రస్తుత రాజకీయ పరిణామలపై జరగనున్న సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు కనకాల పూర్ణచంద్రరావు, బానావతి భద్రయ్య, కె రాజు సత్యన్నారాయణ, షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు.










