Sep 11,2023 00:01

ప్రజాశక్తి - అద్దంకి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ముఖః మండపం పునః నిర్మాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో  దేవస్థానంలో నూతనంగా బాలాలయం నిర్మాణం చేశారు. బాలాలయంలో ఆలయ పూజారులు అంగరంగ వైభవంగా, భక్తి శ్రద్దలతో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించారు. ఈ ప్రతిష్ట మహోత్సవంలో ఆలయ ఈఓ టి సుభద్ర, ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు.