Mar 11,2023 19:35

మాట్లాడుతున్న ఏసురత్నం

ప్రశ్నించే వారిని గెలిపించండి
ఉద్యోగులను ఓటు అడిగే హక్కు వైసిపి ప్రభుత్వానికి లేదు

ప్రజాశక్తి - వెలుగోడు

ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిని ఓటు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని సిఐటియు నంద్యాల జిల్లా అధ్యక్షులు వి. యేసు రత్నం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి శ్రీనివాసులు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కే రామదాసు, సిఐటియు వెలుగోడు మండల అధ్యక్షులు వి నాగమోహన్‌, ఆవాజ్‌ జిల్లా సహాయ కార్యదర్శి మహమ్మద్‌ రఫీ, నాయకులు జి బాష అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఉద్యోగులకు, కార్మికులకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని శత్రువులుగా చూస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతూ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వారానికే సిపిఎస్‌ రద్దు చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు కావచ్చునా సిపిఎస్‌ రద్దు గురించి మాటల్లేవ్‌ అన్నారు. సంవత్సరానికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి, మూడు సంవత్సరాలుగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నియంతృత్వ విధానాలను ప్రశ్నించే పిడిఎఫ్‌ అభ్యర్థులైన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్‌ పోతుల నాగరాజు, టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిలకి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి వేయించి గెలిపించాలని వారు కోరారు. బేతంచెర్ల : చదువుకున్న మేధావులారా శాసనసభ మండలికి సమస్యలపై పాలకులను ప్రశ్నించే గొంతుకలను గెలిపించండి అని సిఐటియూ జిల్లా నాయకులు వై ఎల్లయ్య, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆర్‌ ఈశ్వరయ్య పట్టభద్రుల ఓటర్లను అభ్యర్థించారు. ఈనెల 13వ తేదీన జరుగ బోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బేతంచెర్ల మండ లంలోని బలపాల పల్లె, హెచ్‌ కొట్టాల, గోర్లగుట్ట గ్రామాలలో శనివారం నాడు స్థానిక నాయకులు ఎన్వి రమణ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పిడిఎఫ్‌ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజబాబు, వెంకటరమణ, నరసింహ, యువరాజు, వెంకటేశ్వర్లు, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని నందికొట్కూ రులో టౌన్‌లో సిపిఎం, ప్రజా సంఘాలు ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే భాస్కర్‌ రెడ్డి, నాయకులు గోపాలకృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు పి వెంకటేశ్వర్లు, బేస్తరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పీపకీర్‌ సాబ్‌, ఆంజనేయు లు, జయరాన్ని, నాగన్న, రామ్‌ రెడ్డి ,ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కుమార్‌, ప్రజా సంఘాల కార్యకర్తలు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఉదయం ఏడు గంటల నుండి ప్రచారం చేపట్టారు. ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ అధికార పార్టీ తప్పుడు మార్గాల్లో గెలుపొందేకు అక్రమార్గాలకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజల పక్షాన నిజాయితీగా పనిచేసే పోతుల నాగరాజును, కత్తి నరసింహారెడ్డిలు గెలిపించుకోవాలని వారు కోరారు.