ప్రశ్నించే అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపించండి : ప్రజా సంఘాలు
ప్రజాశక్తి - ఆత్మకూరు
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలను ఎమ్మెల్సీగా గెలిపించాలని అభ్యర్థిస్తూ ఆత్మకూరు పట్టణంలోని గరీబ్ నగర్‌లో సోమవారం నాడు ఇంటింటి ప్రచారం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షులు ఏ.రణధీర్, సిఐటియు పట్టణ కార్యదర్శి డి. రామ్ నాయక్, పట్టణ పౌర సమాఖ్య నాయకులు ఏ సురేంద్రలు మాట్లాడుతూ పోతుల నాగరాజుకి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిలకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నారని అన్నారు. వెలుగోడు: ప్రజల హక్కుల కోసం పోరాటాలు చేసే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం, జిల్లా రైతు సంఘం నాయకులు యాదాటి నాగేంద్రుడు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామదాసు, ఆవాజ్ జిల్లా నాయకులు మహమ్మద్ రఫీ, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రఘు రాముడు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు మండల అధ్యక్షులు వాదం నాగమోహన్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడారు. పిడిఎఫ్, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, కెవిపిఎస్, బీసీ సంఘం నాయకు లు వెంకటయ్య, కిషోర్, కృష్ణ, ఆంజనేయులు, ఎర్ర బాష, నూరుల్లా, భాస్కర్, ఇస్మాయిల్, మదార్ వలి, సుబ్బయ్య, సుధాకర్, మహమ్మద్‌సా, ఖాదర్ వలీ, నాగేశ్వరరావు, శివుడు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : ప్రజా సమస్యలపై గల గళం ఎత్తే పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించాలని ఎపి వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బొల్లు ప్రసాద్ బాబు యాదవ్ ఓటర్లను కోరారు. మండలంలోని ఎదురుపాడు, జడ్డువారిపల్లె, కొక్కెరంచ, నాగంపల్లి గ్రామాల్లో పిడిఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థులకు మద్దతుగా వారు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనమండలిలో పిడిఎఫ్ సభ్యులు అటు అధికార పక్షానికి గాని ఇటువంటి ప్రతిపక్షానికి గాని కొమ్ము కాయకుండా ప్రజల వైపు నిలబడి ప్రజా సమస్యలపై నికరంగా ప్రశ్నించడం జరుగుతుందన్నారు. బేతంచెర్ల: ఉద్యమకారుడైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండలం సిపిఎం మండల కార్యదర్శి ఆర్ ఈశ్వరయ్య, పట్టణ కార్యదర్శి వైబి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ఎల్లయ్య అభ్యర్థించారు. మండల పరిధిలోని బుగ్గాన పల్లి గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు వై ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు గెలిపించాలని ప్రచారాన్ని నిర్వహించారు. సిపిఎం నాయకులు జింక సుధాకర్, సురేంద్ర, హరి, రాజు, సంజీవ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. రౖటప్: ఓటర్లు అభ్యర్థుల గురించి వివరిస్తున్న వ్యకాస నాయకులు(1)
పగిడ్యాల : పిడిఎఫ్ అభ్యర్థులు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు కత్తి నరసింహరెడ్డి, పోతుల నాగరాజులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జిల్లా వ్యకాస అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు ఓటర్లను కోరారు. సోమవారం పగిడ్యాల గ్రామంలోని జడ్పి ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్‌ల్లో, ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. వైసిపి, టిడిపిలకు బుద్ది చెప్పాలంటే పోతుల నాగరాజును, కత్తి నరసింహారెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా నాయకులు పక్కిర్‌సాహెబ్, కెవిపిఎస్ నాయకురాలు ఉశేనామ్మ తదితరులు పాల్గొన్నారు.










