May 28,2023 23:29

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి వస్తున్న విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) ప్రిలిమినరీ పరీక్ష విశాఖలో ప్రశాంతంగా ముగిసింది. లంకపల్లి బుల్లయ్య కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదివారం పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిబంధనలు, ఏర్పాట్లుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ పరీక్షకు విశాఖ జిల్లాలో మొత్తం 29 సెంటర్ల నందు 10,864 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా ఉదయం పరీక్షకు 5607 మంది, మధ్యాహ్నం పరీక్షకు 5536 మంది హాజరయ్యారు. 51.28 శాతం హాజరు నమోదైంది. ఈ కార్యక్రమంలో అర్బన్‌ తహశీల్దార్‌ ఎం.శ్యామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.