
ప్రజాశక్తి - పరవాడ: మండలంలోని కన్నూరు పంచాయతీ ఏడో వార్డుకు నిర్వహించిన ఉప ఎన్నికలో వైసిపి బలపరిచిన అభ్యర్థి మడక అప్పారావు గెలుపొందారు. శనివారం జరిగిన పోలింగ్‌లో192 ఓట్లుకు గాను 158 ఓట్లు పోలైనాయి. ఒక ఓటును తిరస్కరించారు.వైసిపి అభ్యర్థి మడక అప్పారావుకు 96 ఓట్లురాగా టిడిపి బలపరిచిన శీరంశేట్టి సత్తిబాబుకు. 62 ఓట్లు వచ్చాయి, దీంతో 34 ఓట్ల మెజార్టీతో అప్పారావు గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
మునగపాక రూరల్: మండలంలోని మెలిపాక వార్డు సభ్యునిగా వైసిపి బలపరిచిన గొల్ల అమర వెంకట సత్యనారాయణ విజయం సాధించారు. ఆరవ వార్డు సభ్యుడు గొల్ల పైడయ్య మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించగా, వైసిపి అభ్యర్థి అమర వెంకట సత్యనారాయణ 22 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పోటీలో టిడిపి, జనసేన అభ్యర్థులు నిలిచారు. . సత్యనారాయణ విజయంపై గ్రామ సర్పంచ్ అయినంపూడి భాస్కరరాజు, రామరాజు, ఇతర వైసిపి నేతలు అభినందించారు.
నర్సీపట్నంటౌన్:మండలంలో మెట్టపాలెం గ్రామం లో వార్డ్ మెంబర్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతుదారుడు పైల కొండబాబు మూడు ఓట్ల తేడాతో గెలుపొందారని ఎన్నికల అధికారి తెలిపారు. కొండ బాబును జడ్పిటిసి సుకల రమణమ్మ, బోలెం రాంప్రసాద్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు లాలం శ్రీరంగ స్వామి అభినందించారు.
నక్కపల్లి:మండలంలోని చినదొడ్డిగల్లు లో పంచాయతీ 1వ వార్డ్ మెంబర్‌గా నాయుడు నానాజీ గెలుపొందినట్లు ఆర్‌ఓ జి.సత్యనారాయణ వెల్లడించారు.పంచాయతీ 1వ వార్డుకు శనివారం నాడు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.దాడిశెట్టి ఈశ్వరరావు, నాయుడు నానాజీ పోటీలో నిలిచారు. ఈ పోటీల్లో వైసిపి మద్దతుదారుడు నాయుడు నానాజీకి 143 ఓట్లు రాగా, దాడిశెట్టి ఈశ్వరరావుకు 142 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఒక ఓటు మెజార్టీతో నాయుడు నానాజీ వార్డు మెంబర్‌గా గెలుపొందినట్లు ఆర్‌ఓ ప్రకటించారు.మొత్తం ఓట్లు 317గాను 294 ఓట్లు పోలైనట్లు ఆర్‌ఓ సత్యనారాయణ తెలిపారు.92.74 పోలింగ్ శాతం నమోదైనట్లు వెల్లడించారు.గెలుపొందిన నాయుడు నానాజీకి ధ్రువపత్రాన్ని ఆర్వో అందజేశారు.ఎస్‌ఐ శిరీష పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొత్తకోట:రావికమతం మండలంలోని తట్టబంద 8వ వార్డు మెంబరుగా నమ్మి నాగమణి, కవగుంట 2వ వార్డు మెంబరుగా కంఠముఖి జానకి ఏక గ్రీవంగా ఎంకయ్యారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి చైతన్య శనివారం తెలిపారు. కవగుంట 2వ వార్డు మెంబరు కంఠముఖి శ్రీనివాసరావు అప్పట్లో కరోనా తో మృతి చెందగా తట్టబంద వార్డు మెంబరు అప్పలనాయుడు గుండెపోటుతో అప్పట్లో మతి చెందడంతో నోటిఫికేషన్ వెలువడగా వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు.
భీమునిపట్నం : భీమిలి మండలం లకీëపురం పంచాయతీ సర్పంచ్‌గా వైసిపి బలపర్చిన లచ్చుభుక్త జగదీశ్వరరావు, టి.నగరిపాలెం పంచాయతీ 10వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి పూసర్ల రామారావు ఏకగ్రీవంగా విజయం సాధించారు.
పెందుర్తి : మండలంలోని గొరపల్లి గ్రామంలో రెండేళ్ల క్రితం వార్డు మెంబర్ తంగేటి అప్పారావు మృతిచెందడంతో ఆ స్థానానికి శనివారం ఎన్నిక నిర్వహించారు. వార్డులో సుమారు 244 ఓట్లు ఉండగా 174 ఓట్ల వరకు పోలయ్యాయి. టిడిపి బలపరిచిన అభ్యర్థి చిన్నకు 25 ఓట్లు, వైసిపి బలపర్చిన అభ్యర్థి తంగేటి దేవుడమ్మకు 149 ఓట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. వైసిపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు.
పద్మనాభం : పద్మనాభం మండలంలో మూడు గ్రామ పంచాయతీల్లో వార్డు మెంబర్లకు నిర్వహించిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. చిన్నాపురం రెండవ వార్డు మెంబర్‌గా పి.కృష్ణ, రెడ్డిపల్లి 9వ వార్డు మెంబర్‌గా బి.సత్యవతి, బాంధేవపురం వార్డు మెంబర్‌గా జి.లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.