Apr 06,2023 22:35

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు జిల్లాలో గురువారం నిర్వహించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 99.34 శాతం హాజరు నమోదైంది. 26,382 మందికిగాను 26,219 మంది హాజరయ్యారు. 163 మంది గైర్హాజరయ్యారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు 32 కేంద్రాలను, డిఆర్‌ఒ ఒక కేంద్రాన్ని, డిఇఒ 5 కేంద్రాలను సందర్శించారు. మధ్యాహ్నం నుండి నిర్వహించిన ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌ ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి ఎస్‌ఎస్‌సికి 8 సెంటర్లలో 1744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంటర్‌కు సంబంధించి 14 పరీక్షా కేంద్రాల్లో 3352 మంది హాజరయ్యారు.
పల్నాడు జిల్లాలో గురువారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో 99.03 శాతం హాజరు నమోదైంది. 24305 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 24084 మంది హాజరయ్యారు. 221 మంది గైర్హాజరయ్యారని డిఇఒ శ్యామ్యూల్‌ కుమార్‌ తెలిపారు. 126 పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలను 10 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 45 సిట్టింగ్‌ స్క్వాడ్‌లు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.