Apr 03,2023 21:15

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ

ప్రశాంతంగా 'పది' పరీక్షలు ప్రారంభం
- 22,693 మంది విద్యార్థులు హాజరు..
- 286 మంది గైర్హాజరు
- కేంద్రాలను జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి, డిఇఒ తనిఖీ
- దొర్నిపాడులో విద్యార్థినికి అకస్మాత్తుగా కడుపు నొప్పి.. ఆస్పత్రికి తరలింపు
- కొలిమిగుండ్ల మండలంలో రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి గాయాలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     నంద్యాల జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 22,979 మంది విద్యార్థులకు గాను 22,693 మంది పరీక్షకు హాజరయ్యారు. 286 మంది విద్యార్థులు గైర్హాజరుయ్యారు. నంద్యాల పట్టణంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌, ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి, డిఇఒ అనురాధలు తనిఖీ చేశారు. అలాగే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 28 పరీక్ష కేంద్రాలను విజిట్‌ చేశారు. దొర్నిపాడులోని జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థినికి అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పబ్లిక్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌, మాస్‌ కాపీయింగ్‌, ఇతర అవకతవకలు జరగకుండా పటిష్టంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లోకి కాలుక్యులేటర్లు, మొబైల్‌ ఫోన్లు, ఏ ఇతర ఎలక్రానిక్‌ వస్తువులను అనుమతించ రాదన్నారు. ఇన్విజిలేటర్ల మొబైల్‌ ఫోన్లు కూడా బయటే డిపాజిట్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల సమీప ప్రదేశాల్లో 144 సెక్షన్‌ అమలు పరచడంతో పాటు జిరాక్స్‌ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. తాగునీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మొదటి రోజు పరీక్షల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని సెంటర్లలో ఫ్యాన్లు లేకపోవడంతో విద్యార్థులు ఉక్క పోతతో అల్లాడిపోయారు. రుద్రవరం : రుద్రవరంలోని కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాల, మోడల్‌ పాఠశాలలో సోమవారం 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలలో 156 మంది విద్యార్థులకు గాను 155 మంది హాజరయ్యారు. ఒకరు గైర్హాజరయ్యారు. మోడల్‌ పాఠశాలలో 198 మంది విద్యార్థులకు 196 మంది పరీక్షలు రాశారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. కేంద్రాలను ప్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి డిప్యూటీ డిఇఒ క్రిస్టఫర్‌, పాఠశాల చీఫ్‌ నాగేశ్వరరావు, డిపార్ట్మెంటల్‌ ఆఫీసర్‌ గుర్రప్ప, చీఫ్‌ శ్రీనివాసులు, డిపార్ట్మెంటల్‌ ఆఫీసర్‌ జాఫర్‌లు పరిశీలించారు. మహానంది : మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, క్రీస్తుజ్యోతి పాఠశాలలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 167 మంది విద్యార్థులకు గాను 148 మంది హాజరయ్యారు. క్రీస్తుజ్యోతి పాఠశాలలో 155 మంది విద్యార్థులకు గాను 145 మంది హాజరయ్యారు. పాఠశాలలను తహసీల్దార్‌ జనార్దన్‌ శెట్టి పర్యవేక్షించారు. కేంద్రాల వద్ద మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అవుకు : అవుకు మండలంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలో 81 మంది విద్యార్థులకు గాను 78 మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు. జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో 164 మంది విద్యార్థులకు గాను 160 మంది పరీక్షలు రాయగా 4 గైర్హాజరయ్యారు. బాలికల ఉన్నత పాఠశాలలో 262 మంది విద్యార్థులకు గాను 255 మంది హాజరు కాగా ఏడుగురు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఎంఇఒ శ్రీధర్‌ రావు పర్యవేక్షించారు. బనగానపల్లె : మండలంలోని 8 పరీక్ష కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని ఎంఈఓ స్వరూప తెలిపారు. మొదటి రోజు 1413 మంది విద్యార్థులకు గాను 1409 మంది హాజరయ్యారని, 14 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ పట్టణంలోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో రెండు సెంటర్లు, బాలుర ఉన్నత, బాలికల ఉన్నత పాఠశాల, ప్రజ్ఞ ఏవిఆర్‌, రాఘవేంద్ర ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 1347 మంది విద్యార్థులకు గాను 1324 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలను కట్టుదిట్టమైన వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఆళ్లగడ్డ టౌన్‌ సిఐ జీవన్‌ గంగానాథ్‌ బాబు తెలిపారు. సంజామల : మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎస్సై ప్రతాప్‌ తెలిపారు. కేంద్రాల వద్ద జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. కోవెలకుంట్ల : పట్టణంలోని సెయింట్‌ జోసెఫ్‌, గర్ల్స్‌ హైస్కూల్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ఎంఈఓ తిమ్మారెడ్డి తెలిపారు. 580 మంది విద్యార్థులకు గాను 573 మంది హాజరయ్యారని, 7 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఆళ్లగడ్డ : ఉయ్యాలవాడలోని ఎపి మోడల్‌ స్కూలు, జడ్పిహెచ్‌ హైస్కూల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జడ్పీహెచ్‌ హైస్కూల్లో 175 మంది విద్యార్థులు, మోడల్‌ స్కూల్‌లో 151 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఎస్‌ఐ సత్యనారాయణ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొలిమిగుండ్ల : మండలంలోని మూడు పరీక్ష కేంద్రాలలో పరీక్షలు ప్రారంభమయ్యాయని ఎంఈఓ జిలానీ భాషా తెలిపారు. 507 మంది విద్యార్థులకు గాను 503 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. కొలిమిగుండ్లలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ ప్లయింగ్‌ స్క్వార్డు లలిత కుమారి తనిఖీ చేశారు.
ఎంపిటిసిల సంఘం జిల్లా అధ్యక్షులు సొంత ఖర్చులతో ఆటో సౌకర్యం ఏర్పాటు
కొలిమిగుండ్ల మండలం గొర్విమాను గ్రామంలో పదో తరగతి పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకు ఎంపిటిసిల సంఘం జిల్లా అధ్యక్షులు పులి ప్రకాశ్‌ రెడ్డి తన సొంత ఖర్చులతో ఆటో సౌర్యాన్ని ఏర్పాటు చేశారు.
పరీక్ష రాసి వస్తుండగా ప్రమాదం
- విద్యార్థినికి, వ్యక్తికి గాయాలు
ప్రజాశక్తి - కొలిమిగుండ్ల
కొలిమిగుండ్ల మండలం కలవటాల గ్రామ సమీపంలో రెండు బైకులు ఢకొీన్న సంఘటనలో ఒక వ్యక్తికి, పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న విద్యార్థినికి గాయాలయ్యాయి. వివరాలు.. కలటాల గ్రామానికి చెందిన ఏసన్న కూతురు కృపావతి, మరొక విద్యార్థిని నాగ తేజస్వినిలు సోమవారం కొలిమిగుండ్లలోని పరీక్షా కేంద్రంలో పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష అనంతరం ఇంటికి వచ్చేందుకు కొలిమిగుండ్ల క్రాసింగ్‌లో బస్సు కోసం విద్యార్థినులు నిలబడ్డారు. అదే సమయంలో ఏసన్న కొలిమిగుండ్లలోని పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళుతుండగా కుమార్తె, నాగ తేజస్వినిలు చూసి వారిని బైక్‌పై ఎక్కించుకొని కలవటాల గ్రామానికి బయల్దేరాడు. అదే సమయంలో రాంకో సిమెంట్‌ పరిశ్రమలోని ఓ ఉద్యోగి విధులు ముగించుకొని బైక్‌ వస్తుండగా ఎదురెదురుగా ఢకొీన్నారు. ఈ ఘటనలో నాగ తేజస్వినికి, ఏసన్నకు గాయాలయ్యాయి. కృపావతికి ఎలాంటి గాయాలు కాలేదు. నాగ తేజస్వినికి చెయ్యి విరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

- విద్యార్థినికి గాయాలు
- విద్యార్థినికి గాయాలు

 

- విద్యార్థినికి గాయాలు
వ్యక్తికి గాయాలు