May 10,2023 23:02

కశింకోట ఆర్‌ఇసిఎస్‌ పాలిటెక్నిక్‌లో పాలీసెట్‌ రాస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి- అనకాపల్లి
అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన పాలీసెట్‌-23 ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అనకాపల్లిలో 16 కేంద్రాల్లో, నర్సీపట్నంలో 11 కేంద్రాల్లో, మొత్తం మొత్తం 27 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగినట్లు జిల్లా కోఆర్డినేటర్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఐవిఎస్‌ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు 9,355 మంది దరఖాస్తు చేసుకోగా 8,840 మంది అంటే 94.5 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని, వీరిలో బాలురు 5,217, బాలికలు 3,623 మంది ఉన్నారని వెల్లడించారు. పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ రవి పఠాన్‌ పరిశీలించినట్టు ఆయన తెలిపారు.
కశింకోట : కశింకోట రాజీవ్‌ గాంధీ ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలీసెట్‌ పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 250 మంది విద్యార్థులకు గాను 234 మంది హాజరైనట్లు పరీక్ష పర్యవేక్షణ అధికారిగా జి.మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కె.శివ, జనరల్‌ హెడ్‌ ఎస్‌.గణేష్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ కె.శివరాం, సిబ్బంది పాల్గొన్నారు.
భీమునిపట్నం : పాలిసెట్‌ -2023 పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది. స్థానిక ఎస్‌విఎల్‌ఎన్‌ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల, కెడార్‌ స్కూల్‌, ఎపి బాలికల గురుకుల పాఠశాల, ది సన్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రాల్లో పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది.