ప్రజశక్తి - చీరాల
మున్సిపల్ కౌన్సిల్ హాలులో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అజెండాలో 37అంశాలు పొందుపర్చారు. అందులో 4 అంశాలను రద్దు చేశారు. ఒక అంశాన్ని వాయిదా వేశారు. సమావేశంలో పలువరు కౌన్సిలర్లు సమస్యలపై ప్రశ్నల వర్షం కురింపించారు. చీరాల పట్టణంలో అభివృద్ది జరగాల్సిన అంశాలపై దృష్టిపెట్టాలని కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే 30నిమిషాల వ్యవధిలోనే సమావేశం ముగిసింది. కార్యక్రమంలో కమిషనర్ రామచంద్రారెడ్డి, టిపిఎస్ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.










