ప్రజాశక్తి-కంచికచర్ల
కంచికచర్ల లో ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కంచికచర్ల మండలంలో 5 సెంటర్లులో 4072 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 3524 మంది హాజరయ్యారు. 568 మంది గైర్హాజరైనట్లు సిఐ ఐవి నాగేంద్ర కుమార్, ఎస్‌ఐ పివియస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. విజయవాడ డీసీపీ మేరి ప్రశాంతి మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షా హాలులో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలిం చారు. నందిగామ ఏసిపి జి నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు
ఉచిత బస్సుల ఏర్పాటు
నందిగామలో కస్తాల మరి యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు ఆదివారం జరిగిన రాతపరీక్షలో ఎమ్మెల్యే -ఎమ్మెల్సీ ల సొంత నిధులతో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను పంపించారు. ఈ సందర్భంగా ఉచిత కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ వాసుదేవరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ,ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నిరుద్యోగులు యువత కోసం లక్షలాది రూపాయల సొంత నిధులతో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా, చివరికి వారు పరీక్ష రాయడానికి కూడా పరీక్షా కేంద్రాలకు వెళ్ళటానికి సొంత నిధులతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.










