ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
ప్రజాశకి - పగిడ్యాల
మండలంలోని లక్ష్మాపురం అంచ సమీపాణ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్‌మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్బంగా ఎంఇఒ సుభాన్, ప్రిన్సిపాల్ వెంకటరమణమ్మలు పరీక్షలను తనిఖీ చేసి మాట్లాడారు. గురుకులంలో ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ మొదటి సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్షలు నిర్వహించామన్నారు. 5వ తరగతి 675 మంది విద్యార్థులకుగాను 146 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని, ఇంటర్ మొదటి సంవత్సరం 313 మంది విద్యార్థులకు గాను 54 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు.
పరీక్షలను తనిఖీ చేస్తున్న ప్రిన్సిపాల్, ఎంఇఒ, అబ్జర్వర్










