Nov 03,2023 23:09

ప్రజాశక్తి-అమలాపురం
వచ్చే ఏడాదిలో నిర్వహించనున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకై పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజరు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా మరియు పోలీసు ఉన్నతాధికారులు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొట్ట మొదటిగా సన్నద్ధత చర్యలపై వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా జాయిం ట్‌ కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 9న చెన్నై లో భారత ఎన్నికల సంఘం సమావేశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తుగా ఈ సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సంక్షిప్త సవ రణ ప్రక్రియలో పురోగతిని సాధించి ఖచ్చితత్వంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగు ణంగా నివేదిక రూపొందించాలని ఆదే శించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిసెప్షన్‌ స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్పాచ్‌, ఓట్ల లెక్కింపు కేంద్రాలను స్థానిక శ్రీనివాస ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కళాశాల నందు ఏర్పాటు కు యోచన చేస్తున్నట్లు ఆమె తెలి పారు. ఎన్నికల ప్రవర్తన నియమా వళి సక్రమంగా అమలు పరిచేందు కు మండలాలు వారిగా బందాలను నియమించాల్సి ఉంటుందన్నారు. పోలింగ్‌ కేంద్రాల లొకేషన్లు కమ్యూ నికేషన్‌ ప్లాన్లు రూపొందించాలన్నా రు. జిల్లా ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని సక్రమంగా అమ లుపరచడంలో పోలీస్‌ యంత్రాంగం కీలకంగా వ్యవహరి స్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌ సత్తి బాబు, అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌ ఖాదర్‌ భాషా తదితరు లు పాల్గొన్నారు.