Nov 08,2023 22:45

పోస్టర్లు ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్‌ : ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీద్దామని సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబులు పిలుపునిచ్చారు. ఈ ఈమేరకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం ఆధ్వర్యంలో నవంబర్‌ 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబులు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కలవరపరుస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ముఖ్యంగా బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాలలో మైనారిటీలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. కోట్లాదిమంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్‌ కోడ్లను తెచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం నవంబర్‌ 15న విజయవాడలో నిర్వహించే బహిరంగసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇఎస్‌ వెంకటేష్‌, పెద్దన్న, పైపల్లి గంగాధర్‌, బడా సుబ్బిరెడ్డి, నాయకులు జియల్‌ నరసింహులు, లక్ష్మీనారాయణ, పైపల్లి గంగాధర్‌, సాంబశివ, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : అసమానతలు లేని అభివద్ధి కోసం ప్రజారక్షణబేరి కార్యక్రమంలో భాగంగా ఛలో విజయవాడను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జంగాలపల్లి పెద్దన్న, పట్టణ కార్యదర్శి నామాలనాగార్జున పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని సీపీఎం పార్టీ ఆవరణంలో ఛలో విజయవాడ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్‌హెచ్‌ బాషా, రైతుసంఘం మండల కార్యదర్శి మారుతి, వెంకటస్వామి, సిఐటియు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.