ప్రజాశక్తి - నెల్లిమర్ల : ఒమ్మి గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ఆదివారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో పత్ర ద్రావణం తయారు చేయడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉత్తర కోస్తా రీజనల్ అధికారి హేమ సుందర్ రైతులకు పలు పత్ర ద్రావణం ఉపయోగాలు వివరించారు. వరిలో వచ్చే తెగుళ్ళ, పురుగులు, పొడ తెగుళ్లు, చీడ పీడలను పత్ర ద్రావణంతో నివారించుకోవచ్చని తెలిపారు. రైతులు ఏటిఎం మోడల్ వేసుకోడం వల్ల ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఆచరించడంతో నిరంతరం కూరగాయలు దిగుబడిన పొందవచ్చని, నేలను 365 రోజులు కప్పి ఉంచవచ్చన్నారు. ఇలా చేయడం పౌష్టిక ఆహారంతో పాటు మంచి నేలలు తయారై చీడ పీడల సులువుగా నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సత్యనారాయణ, గాయత్రి, రామలక్ష్మి, లక్ష్మి, కృష్ణ, దుర్గ రావు, సంతోషి, దుర్గ, రవణమ్మ పాల్గొన్నారు.
గుర్ల: మండలంలోని గిరిడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో భాగంగా ఆదివారం వరి పంటలో ఆకు చుట్టు పురుగు నివారణకు బ్రహ్మస్త్రం తయారీ గురించి ప్రకృతి వ్యవసాయ కార్యకర్త కె సూర్యకుమారి వివరించారు. పిల్లా రాజేశ్వరి పొలంలో 2ఎకరాలు వరి పంటకు ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయం చేస్తు న్నారు. వరి పంటకు ఆకు చుట్టు పురుగు గుర్తించి నివార ణకు బ్రహ్మాస్త్రం తయారీ గురించి వివరించారు. తయారు విధానంపై రైతుకు వివరించారు. ఈ బ్ర హ్మాస్త్రం పచ్చ పురుగు, గొంగులీ పురుగు, శనగ పచ్చ పురుగు, వరి పంటకు ఆకు చుట్టుపురుగు నివారణకు బాగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాజేశ్వరి, బంగారం, లక్ష్మీనరసమ్మ పాల్గొన్నారు.










