కలకడ : ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కొనియాడారు. శుక్రవారం మండలంలోని నడిమిచర్ల పంచాయతీ కొత్తపల్లి నడిమిచర్ల చిన్న మొటుకు అడవిలో మాదిగపల్లె గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సంక్షేమ పథకాలు సక్ర మంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అధికారులు చేరువుగా ఉండేటట్లు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటరీ వ్యవస్థ స్థాపించి ప్రజలకు ఉన్న సమ స్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి ఎంతగానో కషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ధవీకరణ పత్రాలు కోసం మండల కేంద్రాలకు కాళ్లరిగేలా తిరిగే వారని ఇప్పుడు అలా కాకుండా గ్రామ సచివాలయాల్లోనే ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేసిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నాడు-నేడు పథకం పాఠశాల రూపురేఖలు మార్చి విద్య వ్యవస్థ నూతన ఒరవడికి నాంది పలికారని చెప్పారు. గత ప్రభుత్వం కంటే పింఛన్లను ఎక్కు వగా ఇచ్చిన ఘనత కూడా సిఎంకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎంప ిపి శ్రీదేవిరవికుమార్, మండల పార్టీ కన్వీనర్ కమలాకర్ రెడ్డి, ఆర్‌బికె మం డల కన్వీనర్ హరినాద్‌రెడ్డి, ఎంపిటిసి కష్ణారెడ్డి, సర్పంచులు లింగమ్మ, రాజ గోపాల్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి, తహశీల్దార్ ప్రదీప్, ఎంపిడిఒ పరమేశ్వర్‌రెడ్డి, ఎంఇఒ మునీంద్రనాయక్, ఎపిఒ చెన్నకేశవులు, ఎపిఎం రమేష్, ఎస్‌ఐ తిప్పేస్వామి, ఎఎస్‌ఐ బాలకష్ణ, పోలీసు సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. పుల్లంపేట : మండల పరిధిలోని రామసముద్రం గ్రామ సచివాలయ పరిధిలోని గొల్లపల్లి, రామసముద్రం దళితవాడ కుమారునిపల్లి సచివాలయ పరిధిలోని దళితవాడ, కోనయ్య గారి పల్లి, కోనయ్య గారి పల్లి హరిజనవాడ, అరుంధతి వాడ తదితర గ్రామాల మీదుగా ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో కడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ పభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాసమస్యలు తెలుసుకొని సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో విజరు కుమార్ రెడ్డి, దలవాయిపల్లి మాజీ సర్పంచ్ మల్లికార్జున రెడ్డి, స్టేట్ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ మడగలం శ్రీనివాసులు, పుల్లంపేట సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసుల రెడ్డి, సర్పంచ్ పిచ్చిరెడ్డి, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, తాసిల్దార్ నరసింహ కుమార్, ఎంపిడిఒరఘురాం, ఎస్‌ఐ రఘురాం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.