
న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత ఎత్తైన రహదారిని భారత్ నిర్మించింది. తూర్పు లఢఖ్‌లో 19,300 అడుగులు ఎత్తులో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిందని తాజా ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకూ బలివియా పేర వున్న ఈ రికార్డును చెరివేసింది. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ల కన్నా ఎత్తులో ఈ రహదారిని నిర్మించారు. నేపాల్‌లోని దక్షిణ బేస్ క్యాంప్ 17, 598 అడుగుల ఎత్తులో ఉండగా.. టిబేట్‌లో ఉన్న ఉత్తర బేస్ క్యాంప్ 16,900 అడుగుల ఎత్తులో ఉంది. ఇంకా చెప్పాలంటే విమానాలు ఈ రోడ్డుపై నుండి చూస్తే చాలా దగ్గరలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాయి. ఎందుకంటే మామాలుగా విమానాలు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగా... అందులో సగానికి పైగా ఎత్తులో ఈ రోడ్డును నిర్మించారు. 'ఉమింగ్లా పాస్ వద్ద 19,300 ఎత్తులో ఈ రహదారిని నిర్మితమైంది. ఇది బలివియా రికార్డును చెరిపేసింది. బలివియా 18,953 అడుగుల ఎత్తులో రహదారిని నిర్మించింది. ఉమింగ్లా పాస్ ఇప్పుడు సామాజిక- ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు, లఢక్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ రోడ్డుతో అనుసంధానించాం' అని ప్రభుత్వం పేర్కొంది. ప్రమాదకరమైన భూభాగంలో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది పనిచేసి.. 52 కిలోమీటర్ల పొడవైన, ఎత్తైన రోడ్డును నిర్మించి... ఈ ఘటన సాధించారని పేర్కొంది. ఈ రహదారి లడ్డాఖ్‌లోని ముఖ్య పట్టణాలను కలుపుతోందని చెప్పింది.